అశ్వాపురం: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

విద్యుత్ నిర్వహణ పనుల నేపథ్యంలో అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు, వెంకటాపురం, గొందిగూడెం, కొత్తూరు, ఎలకలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఇన్చార్జి ఏఈ మణిదీప్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్