విద్యుత్ ఉద్యోగుల నిరసన

2022 ఏప్రిల్ నెల నుండి రావాల్సిన పి.ఆర్.సి ని తక్షణమే అందజేయాలని కోరుతూ సంఘాల జే.ఏ.సీ ఆధ్వర్యంలో సత్తుపల్లి డివిజన్ విద్యుత్ కార్యాలయం ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఖమ్మం ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస చారి రమణ రెడ్డి లు మాట్లాడుతూ 2018లో పిఆర్సి అమలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఉద్యోగులకు ఇస్తున్న పి. ఆర్. సి ని 3 నుండి 5 శాతం పెంచి న్యాయం చేస్తామన్నారని, కానీ 2022 ఏప్రిల్ నుండి సంవత్సర కాలంగా రావాల్సిన పిఆర్సిని ఇప్పటివరకు అందివ్వలేదని దీనివలన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఆర్టిజెన్స్ స్పెషల్ పేని బేసిక్ లో కలపాలని, రెగ్యులర్ ఉద్యోగులకు అందిస్తున్న సదుపాయాలను విద్యుత్ ఉద్యోగులకు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఆందోళన చేసినప్పుడు పిఆర్సి ని అమలు చేస్తామని చెప్పినా అవి మాటలు వరకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు తక్షణమే పి. ఆర్. సి అమలు చేసి, విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.

నిరసన తెలిపిన వారిలో డి. ఈ రాములు, ఏ. ఈ శరత్ బాబు, 1104 రమణ, 327 మరియదాసు , ప్రసాద్ విద్యుత్ కార్మికులు, బీసీ సంఘం నాయకులు షణ్ముఖ చారి సిఐటియు నుండి బుగ్గం వెంకటేశ్వర్లు, రామారావు , ఇస్మాయిల్, యూ. డి. సి రాము , శ్రీనివాసాచారి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్