కల్లూరు: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కల్లూరు సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ మహేంద్ర బాబు తెలిపారు. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్లే దారిలో రోడ్డుకు ఎడమవైపు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, విద్యుత్ తీగల కింద చెట్ల కొమ్మలు నరికే పని ఉన్నందున శుక్రవారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్