సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా గురిజాల లక్ష్మీనారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఇక్కడ మేనేజర్‌గా ఉన్న వి. సునీత సూర్యాపేటకు బదిలీ అయ్యారు. డిపో సిబ్బంది సమన్వయంతో పనిచేసి డిపోకు మంచి పేరు తీసుకురావాలని లక్ష్మీనారాయణ కోరారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువతో సన్మానించారు.