సత్తుపల్లి: సమన్వయంతో శాంతియుతంగా పూర్తయ్యేలా చూడాలి

సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహ్మ మున్సిపాలిటీ ఎన్నికలు అందరి సమన్వయంతో శాంతియుతంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రం, కౌంటింగ్, పోలింగ్ సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల జనరల్ అబ్జర్వర్లతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లను సమీక్షించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్