కామేపల్లి: మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలి

కామేపల్లి మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న బీసీ వసతి గృహం భవనాన్ని వినియోగంలోకి తెచ్చేలా చేపట్టిన మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. బుధవారం ఆమె వసతి గృహంలో పనులను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం ఈ భవనాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, పీఆర్ ఏఈ అశోక్, కార్యదర్శి నర్సింహారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్