ఖమ్మం: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ

ఖమ్మం సీపీ సునీల్ దత్ శనివారం వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో RTC బస్సు, కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రయాణికులకు జరిగిన గాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా ACP సారంగపాణి, CI వెంకటప్రసాద్, SI పవన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్