సింగరేణి మండల తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న అనంతుల రమేష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త తహశీల్దార్ గా ఓరుగంటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ మార్పులు జరిగాయి. గతంలో నేలకొండపల్లిలో పనిచేసిన వెంకటేశ్వర్లు త్వరలోనే సింగరేణి మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.