వైరాలో సేవలు నాలుగు రోజులే!

గత ఇరవై ఏళ్లుగా వైరాలో కొనసాగుతున్న రవాణా శాఖ కార్యాలయంలో ఇకపై వారానికి నాలుగు రోజులే సేవలు అందనున్నాయి. వైరా, తల్లాడ, కొణిజర్ల, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల పరిధి వాహనదారులకు ప్రస్తుతం ఎంవీఐ కార్యాలయం ద్వారా సేవలు అందుతున్నాయి. అయితే, మధిర నియోజకవర్గ వాహనదారులకు దూరం అవుతుందని కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, వారానికి రెండు రోజులు బోనకల్లో సేవలు అందించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మార్పుతో వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్