సోమవారం, వైరా మండలంలోని కాణిపాకం గ్యాస్ ఏజెన్సీని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తనిఖీ చేశారు. ఏజెన్సీ నిర్వహణలో లోపాల కారణంగా వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన గుర్తించారు. దీనిపై స్పందించిన అధికారి, ఐఓసీఎల్ సేల్స్ అధికారితో మాట్లాడి, ఇతర ఏజెన్సీల ద్వారా సరఫరాను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ సేవలు అందించాలని స్పష్టం చేశారు.