వైరా: గ్రీన్ ఫీల్డ్ హైవేను పరిశీలించిన సీపీ

వైరా సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేను ప్రాజెక్టు మేనేజర్ దివ్యతో కలిసి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం పరిశీలించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ హైవే పనులు వేగవంతం చేయాలని, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ఆర్అండ్ బి అధికారులకు సూచించారు. వైరా రింగ్ రోడ్ సెంటర్లో రోడ్డు ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, వాహనదారులు రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్