వైరా: లంచం అడిగితే '1064'కు కాల్ చేయండి

శుక్రవారం వైరాలోని మత్స్య అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో లోపాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ రమేష్ సూచించారు.

సంబంధిత పోస్ట్