వైరా: చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలి

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన చిన్నారి చేయి కోల్పోవడంతో, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని పీఓడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, పీవైఎల్ జిల్లా కార్యదర్శి జక్కుల భరత్ డిమాండ్ చేశారు. వైరా మండలం పుణ్యపురం గ్రామంలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి భరోసా కల్పించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి వికలాంగురాలిగా మారిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్