బుకర్‌ప్రైజ్‌ జాబితాలో కిరణ్‌ దేశాయ్‌ పుస్తకానికి చోటు

ప్రముఖ భారతీయ రచయిత్రి కిరణ్ దేశాయ్ రచించిన ‘ది లోన్లినెస్ ఆఫ్ సోనియా అండ్ సోనీ’ పుస్తకం ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2025 జాబితాలో చోటు దక్కించుకుంది. మంగళవారం విడుదలైన జాబితాలో 13 నవలలు ఉన్నట్లు బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ వెల్లడించింది. దేశాయ్ నవల 650 పేజీలతో అతి పెద్దదిగా ఉండగా, నటాషా బ్రౌన్ రాసిన ‘యూనివర్సాలిటీ’ కేవలం 156 పేజీలతో అతి చిన్నదిగా నిలిచింది. విజేతను నవంబర్ 10న లండన్‌లో ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్