గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో 1918లో నిర్మించిన కోడిగుడ్డు మేడ 107 ఏళ్ల చరిత్రతో రాజసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పారేపల్లి పెదరావమ్మ తన తమ్ముడు పచ్చిపులుసు రాంపుల్లయ్య పేరిట నిర్మించిన ఈ భవన నిర్మాణంలో సున్నం, కోడిగుడ్డు సొన, సహజ రంగులను సిమెంట్‌గా ఉపయోగించారు. ఆ రోజుల్లో గ్రామంలోనే తొలి మేడగా పేరొందిన ఇది, కాలక్రమేణా మేడ సెంటర్‌గా మారి, ఇప్పుడు గ్రామంలో ప్రధాన కూడలిగా విలసిల్లుతోంది.