కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ తెలిపారు. ఈ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని, నిషేధిత ఆయుధాలు కలిగి ఉండటం, ప్రజలకు ఇబ్బంది కలిగించే సమావేశాలు కూడా పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్–1861 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.