కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో కేంద్ర మంత్రి పర్యటన ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖల పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఆదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలో పర్యటించనున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ష మల్హోత్ర కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు రోజులు పర్యటన ఉంటుందన్నారు.