సహజ రంగులతోనే సురక్షిత హోళీ జరుపుకోవాలి – ఎస్పీ నితికా పంత్

జిల్లా ఎస్పీ నితికా పంత్ హోళీ పండుగను ప్రశాంతంగా, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. హానికర రసాయన రంగులకు బదులుగా సహజ రంగులను ఉపయోగించాలని, బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటివి చేయరాదని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్‌లు నిఘా పెంచుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అతివేగం, చెరువుల వద్ద నిర్లక్ష్యం ప్రమాదకరమని, అపోహలు, గొడవలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలందరూ సురక్షితంగా హోళీ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్