మరణించిన ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి ₹99, 800 కార్పస్ చెక్ అందజేత

ఇటీవల గుండెపోటుతో మరణించిన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్‌ఎస్‌ఐగా పనిచేసిన జగదీష్ చంద్రమండల్ కుటుంబానికి, జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ ₹99,800 విలువైన కార్పస్, వీడో ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకుని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరమైన ఇతర ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ వామనమూర్తి, డీపీఓ రవి, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయశంకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్