నూతన జిల్లా సంక్షేమ అధికారికి శాఖ సిబ్బంది శుభాకాంక్షలు

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నూతన ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారిగా శ్రీ వసుదేవ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీసీపీవో బూర్ల మహేష్, సీనియర్ అసిస్టెంట్ కౌసల్యతో కలిసి శాఖ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక నిర్మూలన, చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలు వంటి అంశాలపై శాఖ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని వసుదేవ రెడ్డి సూచించారు.

సంబంధిత పోస్ట్