ఎస్‌ఐఆర్ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సర్వేను జిల్లా కలెక్టర్ కె. హరిత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటి సర్వే పురోగతి, ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో సర్వే పూర్తి చేసి ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఆర్‌వో, మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి, తహసీల్దార్ ఎం. మధుకర్, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్