డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాలి: వాంకిడి ఎస్ఐ

నేటి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాంకిడి ఎస్సై ప్రశాంత్ సూచించారు. గురువారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం నవేగూడలో పోలీస్ మిత్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు యువకులు డ్రగ్స్, గంజాయి, గుట్కాలు, మద్యపానానికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు గురై బంగారం లాంటి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్