కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ ఉద్యోగార్థులకు జిల్లా పోలీస్ శాఖ అండగా నిలుస్తోందని ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ తెలిపారు. ఆమె మార్గదర్శకత్వంలో ఆగస్టు 31న ప్రారంభించిన ఉచిత శిక్షణ కార్యక్రమానికి 2, 700 మంది హాజరుకాగా, ప్రతిభ ఆధారంగా 150 మందిని ఎంపిక చేశారు. అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనం, విద్యా, శారీరక శిక్షణ అందిస్తున్నారు. అంకగణితం, తార్కిక సామర్థ్యానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ను ఎస్పీ పంపిణీ చేశారు. ఇప్పటివరకు మూడు పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల ప్రగతిని పర్యవేక్షిస్తూ అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్ కుమార్, ఇన్స్పెక్టర్లు సతీష్, నీలం రవి పాల్గొన్నారు.