తిర్యాణి మండల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను ప్రభుత్వ ఉద్యోగి, మాజీ ఎంపీటీసీ మార్క శంకర్ గౌడ్ స్వయంగా శ్రమదానం చేసి పూడ్చారు. తిర్యాణి–తాండూర్ ప్రధాన రహదారిపై గుంతల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన ఆయన సోమవారం ఉదయం తన కారులో తట్ట, పార తీసుకువచ్చి రోడ్డు పక్కనున్న మట్టితో 6–7 ప్రమాదకర గుంతలను పూడ్చారు. అధికారులకు పలుమార్లు తెలిపినా మరమ్మతులు చేపట్టకపోవడంతో పౌరుడిగా తన బాధ్యతగా ఈ పని చేశానని శంకర్ గౌడ్ తెలిపారు. ఆయన సేవాభావాన్ని స్థానికులు, వాహనదారులు అభినందిస్తూ, తాత్కాలిక మరమ్మతులతో పాటు ఆర్&బీ శాఖ శాశ్వతంగా బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు.