ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ నితిక పంత్, కేసుల విచారణలో నాణ్యత పెంచి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.