రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులకు ఊరికి, ఇతర పట్టణాలకు వెళ్లే జిల్లా ప్రజలు తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కొమురం భీమ్ జిల్లా ఎస్పీ నితిక పంత్ సూచించారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లే సమయంలో దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పండుగల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా నిరంతర పోలీస్ పెట్రోలింగ్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణానికి వెళ్లే ముందు తమ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని, విలువైన వస్తువులు, నగదు, బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.