కొమరంభీం జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్‌లోని రవిచంద్ర కాలనీ, బజార్‌వాడి అంగన్‌వాడి కేంద్రాలు, మార్కెట్ ప్రాంతంలో షీ టీమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఎ హెచ్ టి యు) బృందాలు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, లింగ సమానత్వం, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలనపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు, చట్టపరమైన రక్షణల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు లైలా, పెంటుబాయ్, షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై బిక్కులాల్, సిబ్బంది స్వప్న, రజిని, వరలక్ష్మి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.