హనుమాన్ జయంతి బందోబస్తుపై ఎస్పీ నితిక పంత్ ఆదేశాలు

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ నితిక పంత్ ఆదేశించారు. డయల్ 100 కాల్స్‌కు తక్షణ స్పందన ఇవ్వాలని, పెట్రోలింగ్‌ను పెంచాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బెట్టింగ్, జూదం, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్