పెండింగ్ కేసుల దర్యాప్తులో నాణ్యత, వేగం ఉండాలి: జిల్లా ఎస్పీ

వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ వాంకిడి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి, మొక్కలు నాటిన అనంతరం గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించారు. పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేసి, ఎస్‌ఓపీ ప్రకారం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా పెంచడంతో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్