సీఎం పర్యటనకు ట్రాఫిక్ ఆంక్షలు – ప్రజలు సహకరించాలి: ఎస్పీ

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా, సోమవారం కొఠారి, కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్, పార్కింగ్ నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీ వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ప్రజలు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలపాలని, రోడ్లపై నిలపవద్దని, ట్రాఫిక్ నియమాలు, భద్రతా సూచనలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్