పెంచికల్ పేట్ తహసీల్దార్‌గా బోడ రవీందర్ బాధ్యతల స్వీకరణ

సోమవారం పెంచికల్ పేట్ మండల నూతన తహసీల్దార్‌గా బోడ రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల నుండి బదిలీపై వచ్చిన ఆయన, ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని, మండల అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన జెట్టి తిరుపతి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్