దహెగాం మండలం దిందా గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి, దిందా–కేతిని గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం దిందా గ్రామానికి వచ్చి ప్రాణహిత నదిని పరిశీలించి, గ్రామస్థులతో నది పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. గతంలో కలెక్టర్ సందీప్ కుమార్ తర్వాత ప్రస్తుత కలెక్టర్ మేడం గ్రామానికి రావడం గ్రామస్థులకు ఆనందంగా మారింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు డోకే నారాయణ, చంద్రయ్య తదితరులు హాజరయ్యారు.