కాగజ్‌నగర్ పట్టణంలోని 4వ వార్డులో నిరుపయోగంగా, చెత్తాచెదారంతో నిండిపోయిన పురాతన మంచినీటి బావిని 17వ వార్డు కౌన్సిలర్ కావేటి విజయ్ కుమార్ బుధవారం శుభ్రం చేయించారు. బావితో పాటు చుట్టుపక్కల మురికి కాలువను కూడా శుభ్రపరచారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా చేపట్టిన ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేసి, కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.