కొమురం జిల్లా జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని తుంగమడుగు గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడీషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా పనులను వేగంగా పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు. పాఠశాలకు అన్ని సౌకర్యాలను త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.