చెక్‌పోస్ట్‌లలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలి – ఎస్పీ

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసేందుకు జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ సిర్పూర్(టి) మండలంలోని వెంకట్రావుపేట అంతర రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను మంగళవారం తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ రిజిస్టర్‌లను పరిశీలించి, ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, మద్యం రవాణాను నిరోధించడానికి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ తనిఖీలో డీఎస్పీ వాహిదుద్దీన్, ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్