మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు కాగజ్‌నగర్ పట్టణంలోని కౌసర్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో, వార్డులు 7, 8, 9, 24లలో మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సమస్యాత్మక వార్డులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.