కాగజ్‌నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీ ప్రజలు వారం రోజులుగా మురుగు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగు నీరు ఇళ్లలోకి చేరుతోంది. దీనివల్ల దుర్వాసన, దోమల బెడద పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోంది. సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని, సానిటరీ ఇన్‌స్పెక్టర్ స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.