బెజ్జూర్ ఎస్ఐ ప్రవీణ్ బదిలీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహించిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. శుక్రవారం ఫెర్టిలైజర్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బెజ్జూర్‌ లో నేరాల నియంత్రణకు, ప్రజలకు చేసిన సేవలకు ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫెర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులు, మండల వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్