పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్

కాగజ్‌నగర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. గురువారం రాజీవ్ చౌక్ నుంచి తీరందాజ్ టాకీస్ చౌరస్తా వరకు మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించిన ఆమె, మురుగు కాలువలను ప్రతిరోజూ శుభ్రపరచడంతో పాటు తడి, పొడి చెత్తను క్రమం తప్పకుండా సేకరించాలని సూచించారు. రహదారులపై చెత్త, మురుగు నీరు వేయకుండా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురుకృప టిఫిన్ సెంటర్ వద్ద రోడ్డుపై వ్యర్థాలు వేసిన యజమానికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్