బారెగూడలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్ మధుకర్

భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్ మండలం బారెగూడ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కాగజ్‌నగర్ తహసీల్దార్ మధుకర్, సర్పంచ్ కోట వేణుగోపాల్ సోమవారం పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ తీరును పరిశీలించిన అధికారులు, ప్రతి అర్హుడికి ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామ ప్రజలు ఫారాలను సక్రమంగా నింపి ఎన్నికల సిబ్బందికి అందజేసి కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని సర్పంచ్ కోట వేణుగోపాల్ కోరారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్