MPPS తాటిపల్లి పాఠశాలను పర్యవేక్షించిన గ్రామ సర్పంచ్

కౌటాల మండలం తాటిపల్లి గ్రామ పంచాయితీలోని MPPS పాఠశాలను గ్రామ సర్పంచ్ బడగే సంతోష్, ఉప సర్పంచ్ డొంగ్రే కేశవ్ రావు వార్డ్ మెంబెర్లతో కలిసి సందర్శించారు. విద్యార్థుల హాజరు, మౌలిక వసతులైన టాయిలెట్, మంచినీరు, ఇంకుడు గుంత, మధ్యాహ్న భోజనం వంటి వాటిపై వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు లేవనెత్తిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సత్కరించారు.

సంబంధిత పోస్ట్