చేతిపంపుల మరమ్మత్తులతో నీటి సమస్య పరిష్కారం

కాగజ్‌నగర్‌ మండలం బారెగూడ గ్రామపంచాయతీలో పనిచేయకుండా నిలిచిపోయిన చేతిపంపుల మరమ్మత్తు పనులను సర్పంచ్ కోట వేణుగోపాల్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి సరఫరా పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని పంచాయతీ సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటేష్, కార్యదర్శి నరేష్, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ చర్యతో గ్రామస్తులకు ఇబ్బందులు తొలగి ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్