భద్రాచలం FDO సుజాత, చర్ల ఇన్‌చార్జ్ DRO కృష్ణయ్యలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పూసుగుప్పలో రోడ్డు నిర్మాణ సమయంలో దెబ్బతిన్న చెట్లపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు FDO రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో భద్రాచలంలోని కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ACB DSP రమేష్ బృందం వారిని పట్టుకుంది. నిందితులపై కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టారు.