భద్రాచలంలో శనివారం డీఎంహెచ్వో డా. తుకారామ్ రాథోడ్ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవలపై సమీక్షించి, యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. రోగుల సౌకర్యార్థం సేవల చార్జీలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, వైద్యుల అర్హతలను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.