భద్రాచలం: గిరిజన మ్యూజియం అభివృద్ధికి చర్యలు

భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ హెరిటేజ్ శాఖ సంచాలకుడు ప్రొఫెసర్ అర్జున్ రావు తెలిపారు. మంగళవారం మ్యూజియాన్ని సందర్శించిన ఆయన ఆదివాసీ చిత్రాలు, కళాఖండాలు, పూర్వకాలపు పనిముట్లను పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తో కలిసి మ్యూజియం ఆధునికీకరణ, విస్తరణపై చర్చించారు. ఈ అభివృద్ధి పనులు పర్యాటకులను మరింతగా ఆకట్టుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్