భద్రాచలం: ఐటీడీఏలో గిరిజన దర్బార్

భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీవో రాహుల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్