అనుమతులు లేని ప్రథమ చికిత్స కేంద్రాలపై డీఎంహెచ్‌ఓ కొరడా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం: పాల్వంచలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ప్రథమ చికిత్స కేంద్రాలు నడుపుతున్నారని, ప్రథమ చికిత్స పేరుతో పరిధి దాటి వైద్యం చేస్తే పోలీసు కేసులు నమోదు అవుతాయని జిల్లా వైద్య అధికారి తుకారాం రాథోడ్ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం కేఎస్పీ రోడ్డులోని ఓ ప్రైవేట్ వైద్యశాలను, స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ప్రథమ చికిత్స పేరుతో బ్లడ్ టెస్టులు, స్కానింగ్‌లు, ఇంజెక్షన్లు, సెలైన్ పెట్టడం వంటివి చేస్తే సహించేది లేదని, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే పోలీసు కేసులు నమోదు అవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆర్ఎంపి వైద్యులకు డీఎంహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేశారు.

సంబంధిత పోస్ట్