జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాల, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను పరిశీలించి, ఏడో, ఎనిమిదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజనం వంటి అంశాలపై ఆరా తీసి, విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.