కొత్తగూడెం: ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి: ఎస్పీ

ఇల్లెందు, అశ్వారావుపేట పురపాలకాలు, కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా సాగించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎస్పీ బి. రోహిల్రాజు అధికారులకు సూచించారు. బుధవారం పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలుగు స్టాటిక్ సర్వేల యన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పటిష్టంగా నిర్వహించడంపై దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్