భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్‌లో జియో పెట్రోల్ బంక్ నుంచి హెచ్‌పీ పెట్రోల్ బంక్, మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకులం హాస్టల్ వరకు సెంట్రల్ లైటింగ్ సరిగా పనిచేయడం లేదని స్థానికులు తెలిపారు. రాత్రివేళ లైట్లు వెలిగి వెంటనే ఆరిపోతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి లైటింగ్ పునరుద్ధరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.